కడ్తాల్ లో పిరమిడ్ ధ్యానమహాసభలు జరుగుతున్నాయి.
కడ్తాల్ కు 6కిలోమీటర్ల దూరంలో బ్రహ్మర్షి పత్రీజీ అధ్వర్యంలో ఈ వేడుకలు ఎంతో
ఘనంగా జరుగుతున్నాయి. పత్రీజీ వెలుగులోకి తెచ్చిన పిరమిడ్ ధ్యాన సిద్ధాంతం ఎంతో
విస్తృతమైందని ఈ సభలను చూస్తే తెలుస్తుంది. ధ్యాన చింతన మరింత పెంపొందడానికి
పిరమిడ్ ఎంతగానో సహకరిస్తుంది. ముఖ్యంగా పిరమిడ్ ఎఫెక్ట్ తో.. మనిషి ఏకాగ్రత ఒక
చోట కేంద్రీకృతమవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద.. పత్రీజీ
ధ్యానాన్ని బాగానే వ్యాప్తి చేయగలిగారు. ఈ మహాసభలకు వెళ్లిన వారికిది మరింత
స్పష్టమవుతుంది. కాకుంటే ఈ పిరమిడ్ కట్టడాన్ని ఫినీష్ చేసి సభలు ప్రారంభించి వుంటే
బావుండేది. ఇంకా పచ్చి పచ్చిగానే వుందా కట్టడం. ఒక ఐరన్ ఫ్రేమ్ ను పిరమిడ్ ఆకారంలో
మలచి దానిపై సిమెంటు రాళ్లను కప్పి వున్నారు.
దీంతో అక్కడెక్కడో ఈజిస్టులో వెలసిన
పిరమిడ్.. ఇండియాలో అందునా ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ శ్రీశైలం హైవేలో
వెలసినట్టైంది. పత్రీజీ ధ్యానం అంటే ఏమని చెబుతారో తెలియదు కానీ, ధ్యానంలో
డ్రమటైజేషన్ మిక్స్ చేయడం పిరమిడ్ ధ్యానగురువుల అలవాటు. ధ్యానం మనసుకు ఎంతో మేలు చేస్తుంది. శ్వాస
మీద ధ్యాస నిలపడం ధ్యానం. ఈ క్రమంలో భాగంగా.. మన ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. దీంతో
మనసుకు శాంతి లభిస్తుంది. ఇందులో వున్న విషయం ఇంతే. ధ్యాన వ్యాప్తి చెందించడానికి
లేని పోని కథనాలను ప్రచారం చేస్తుంటారు ధ్యానగురువులు. గతజన్మలు
సాక్షాత్కారమవుతాయనీ.. తద్వారా గతజన్మలో మన భార్యా, భర్తలెవరో స్పష్టమవుతుందనీ.. అంటూ లేని పోని కథనాలను
ప్రచారం చేసుకుంటారు. ధ్యానంతో మనశ్శాంతి పొందాల్సిన సాధకులు అశాంతికి లోనవుతున్న
ఉదంతాలు కొన్ని వెలుగు చూశాయి. కనుక ధ్యానమైనా, దైవమైనా దాన్ని దానిలాగే చూడ్డంతో
ఆపేయాలి. లేని పోని కట్టుకథలు, అవాస్తవాలను నమ్మి మోసపోవద్దు. అదంత మంచిది కాదు.
ధ్యానం వల్ల కేవలం మనశ్శాంతి మాత్రమే లభిస్తుంది. గతజన్మసాక్షాత్కారాలు, లేని పోని
ఫాంటసీలు ఏం దర్శనమివ్వవు. తస్మాత్ జాగ్రత్త.



పిరమిడ్ లొ ధ్యానం చేస్తే ఏమైనా ఎక్కువ ఫలితం జరుగుతుందా ? ఏదైనా పరిశోదనలు జరిగాయా ? మెదట శరీరాన్ని అదుపులో పెట్టుకుని ( అంటే వ్యాయామం / యోగా ఏదైనా) తరువాత ధ్యానం చేస్తే ఫలితం ఉంటుంది.
ప్రత్యుత్తరంతొలగించుధ్యానం కానీ, పూజ, పునస్కారం, ఎక్సర్ సైజ్ ఏదైనా సరే.. అది చేసే పనల్లా ఒక్కటే, దృష్టిని అనవసరపు ఆలోచనల నుంచి మళ్లించి.. మనసుకు కాసేపు విరామం ఇవ్వడం. నాస్తికులు కూడా విష్ణు సహస్రనామం చదివితే, అరగంట షటిల్ ఆడినంత ఎక్సర్ సైజ్ అనడం వినేవుంటాం. అలాగే ఆయా శరీరాలు కొన్ని మాధ్యమాలకు అనువుగా వుంటాయి. కొందరు రుద్రాక్ష చేతబట్టి అదెంత విలువైందో చెప్పేస్తారు. వైబ్రేషన్స్ బాడీలోకి పాస్ అవడం తద్వారా వారికా అవగాహన ఏర్పడటం ఒక విధానం. అలాగే పిరమిడ్ లోకి వెళ్లనప్పుడు.. చిన్న గ్రాహక శక్తి వుంటే, మనలోని శారీరక మానసిక శక్తినది ప్రభావితం చేయడం గమనిస్తాం. కనుక మీరు దీన్ని అర్ధం చేసుకోవల్సిందిగా మనవి.
ప్రత్యుత్తరంతొలగించు